ఇ-జైన్ కోసం రిజిష్టర్ చేసుకోండి  
 
 

విద్యా సంబంధిత విషయాలుః
జా.ఫ్యా.టె.సం. లోని పాఠ్యక్రమం విద్యార్ధులను సుళువుగా ఒక అంతర్జాతీయ నెట్ వర్క్ తో కలుపుకుపోయేటట్లు దోహదం చేస్తుంది. అలాగే, స్థానిక పరిశ్రమలలోని ఒరవడిని గురించి ఒక చక్కటి, మెరుగైన ఆవగాహనను కలుగజేస్తుంది. ఈ బహుముఖ అంశాలపై ఆధారపడి బోధింపబడే విద్య విశాల ధృక్ఫథంతో తయారుచేయబడిన నిర్మాణక్రమం విద్యార్థులను తీర్చిదిద్దుతూ, వారిని అభివృధ్దిపథంలో నడిపిచడమే ధ్యేయంగా పెట్టుకుంది. మారుతూ వుండే పారిశ్రామిక మరీయు వాణిజ్య స్వరూపాన్ని, ఒరవడిని గమనిస్తూ, ఈ విద్యా కార్యక్రమం యొక్క భానాన్మి బోధనా విధానాన్ని విద్యాబోధకులు మరియు పారిశ్రామికవేత్తలు నిరంతరం సమీక్షిస్తూ వుంటారు.

జా.ఫ్యా.టె.సం 4 ఏళ్లు బ్యాచ్‌లర్ మరియు 2 ఏళ్ మాస్టర్ ప్రోగ్రామ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది, డిజైన్ మేనేజ్ మెంట్ మరియు టెక్నాలజీ రంగాలలో.

శిక్షణ/బోధనా శాస్త్రం.

ఈ సంస్థలో బోధనా విదానం ఒక క్రమ పధ్దతిలో, పొందికగా, సందర్భానుసారంగా మరియు ఆచరణయోగ్యంగా అన్నింటిని తనలో కలుపుకుని పోయేదిగా రూపొందించబడి, నేర్చుకోవడానికి అనువైన వాతావరణాన్ని పెంపొందిస్తూ వుంటుంది. బోధనాపధ్దతి స్వయం- ప్రోత్సాహకరంగా, సమాచారం, అనుభవం మరియు ఆచరణ అన్నవాటితో విద్యను అభ్యసించడంపై దృష్టిని సారిస్తూ. కీలకమైన కార్యనిర్వహణ అనే అంశంపై నుండి బోధనాపధ్దతి, నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెడుతూ అంతర్జాతీయంగా వుండే అనేక అంశాలపైన మరియు సమస్యల పరిష్కరణా పధ్దతిపై దృష్టిని కేంద్రీకరిస్తూ. విద్యార్ధులు తరగతి గదిలోని మరియు వర్క్ షాప్ ఎసైన్ మెంట్లను చేపడుతూ క్షేత్ర పరిశీలనను (ఫీల్డ్ అబ్జర్వేషన్) విర్వహిస్తారు, ప్రజెంటేషన్ ను చేస్తారు, సామూహిక చర్చలలోను, సెమినార్లలోను పాల్గొంటారు మరియు పరిశ్రమలతో సంబంధం పెంచుకోవడంలో ప్రోత్సహించబడతారు.

మూల్యాంకనం, మదింపు చేయడం.

సెమిస్టర్ జరుగుతున్నంత కాలం నిరంతరం మదింపు చేస్తూ వుండడం చేపట్టబడుతుంది, ఎసైన్ మెంట్ల ద్వారా, ప్రోజెక్టులు, ఇంటరన్షిప్పులు, మరియు ప్రజెంటేషన్ల ద్వారా. జ్యూరీలలో విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు వుండి విద్యార్ధి యొక్క పనిని మరియు సామర్ధ్యాన్ని మదింపు చేస్తారు. దీని సుఖ్యోధ్దేశం విద్యార్ధి యొక్క ప్రగతిని, ఒక సమర్ధుడైన వాడుగా, అతి దగ్గరనుండి పరిశీలిస్తూ వుండడం మరియు వారి పనితనం పైన, పురోగతిపైన, అభివృధ్దిపైన క్లిష్టమైన ఫీడ్ బ్యాక్‌నిస్తూ వుండడం.

ముఖ్యమైన విద్యా విషయాలు
వృత్తి కళలను సర్వే చెయ్యడం మరియు డాక్యుమెంటేషన్ః
జా.ఫ్యా.టె.సం. లో సామూహిక వృత్తికళల ప్రోత్సాహకంలో ఒక భాగంగా విద్యార్ధులు క్షేత్రసందర్శనను చేపడతారు. వృత్తికళలో ఆరితేరిన వారితో కలిసి అన్యోన్యంగా వుంటూ, వారితో కలిసి పనిచేస్తూ వుంటారు, వారి ఉత్పత్తులకు విలువను కలుగజేస్తూ.

విద్యా సంబంధిత సందర్శనలు

విద్యార్ధులు తరచుగా పారిశ్రామిక యూనిట్లను సందర్శిస్తూ వుంటారు, వారు నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రత్యక్షంగా, ఆచరణలో పెడుతూవుండడానికి. వారు మ్యూజియమ్ లు, ప్రదర్శనలు, కళాక-తులను ప్రదర్శించే గ్యాలరీలను మరియు ట్రేడ్ ఫెయిర్లను ఫ్యాషన్ రంగంలో చోటుచేసుకుంటూ వుండే ఆధునిక మార్పులను గమనించడానికి.

పరిశ్రమలలో ఇంటర్న్ షిప్

పరిశ్రమ నిర్మాణం, కార్యనిర్వహణ అన్న విషయాలపై అవగాహనను పెంచుకునేందుకు విద్యార్ధులు 6 నుండి 8 వారాల పాటు ఇంటర్న్ షిప్ లో వుంటారు. ఇటువంటి ఇంటర్న్ షిప్ లో వుండగా విద్యార్ధులు పరిశ్రమలలో చోటుచేసుకునే వాస్తవ పరిస్థితులను అర్ధంచేసుకుంటూ, అలవాటు పడడం, అటువంటి పరిస్థితులను తమకు అవ్వయించుకోవడం వంటివి చేస్తారు. వారికి ఆరరణాత్మక ప్రోజెక్టులు ఇవ్వబడతాయి (ఎసైన్ చేయబడతాయి) వారిని వాస్తవ పరిస్థితులలో తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోవడానికి తయారు చేస్తూ. ఇటువంటి ఇంటర్న్ షిప్ పరిశ్రమలకు, తమకు మధ్య సత్సంబంధాలను మెరుగు పరచుకోవడానికి ఈ ఇంటర్న్ షిప్ దోహదపడుతుంది.

డిజైన్ సేకరణ/డిప్లొమా ప్రోజెక్ట్

విద్యార్ధులచే చేపట్టబడిన గ్రాడ్యుయేషన్ ప్రోజెక్టు, వారు కోర్సు జరుగుతున్నప్పుడు నేర్చుకునే వివిధ అంశాలను అవగాహన చేసుకుని, జీర్ణించుకునేందుకు అవకాశం దొరుకుతుంది. పరిశ్రమల వారిచే నిర్వహింపబడు ప్రోజెక్టు వారికి ఒక సవాలు వంటి వేదికను తయారుచేస్తుంది, నేర్చుకున్న విద్యా సంపత్తిని ఇంకా విస్తృత పరచుకోవడానికి, ప్రదర్శించడానికి.