ఇ-జైన్ కోసం రిజిష్టర్ చేసుకోండి  
 
 

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ | మాస్టర్ ప్రోగ్రామ్స్

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - డిజైన్

ఫ్యాషన్ డిజైన్
లెదర్ డిజైన్
యాక్సెస్సరీ డిజైన్
టెక్సటైల్ డిజైన్
నిట్వేర్ డిజైన్
ఫ్యాషన్ కమ్యూనికేషన్

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - టెక్నాలజీ

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్స్ (బి.ఎఫి.టెక్) - అప్పారెల్ ప్రొడక్షన్


బి. డిజైన్ ( ఫ్యాషన్ కమ్యూనికేషన్ )

ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ ఇండస్ట్రీలో, క్రొత్తదైన ఎంతో ఉద్వేగ భరితమైన మార్గాన్ని ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఓపెన్ చేస్తుంది. ఊహించనంతగా పెరుగుతున్న ఇండియాలోని రిటైల్ సినేరియోలో, అనేకమైన డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ బ్రాండ్స్, కంపెనీలు మరియు డిజైనర్లు రావడంతో, ప్రత్యేక మైన బ్రాండ్ ఐడెంటిటీని డెవలప్ చేయడం మరియు వాటి విజిబిలిటీని పెంచడం ప్రతీ వారికి అవసరం అయింది. అన్ని దశల కమ్యూనికేషన్ డిజైన్లు కలపడానికి, ప్రోడక్ట్ డొమైన్ ని మించి డిజైన్ స్ట్రేటజీని విస్తరించడంలో ప్రవీణులైన కమ్యూనికేషన్ ఫ్రొఫషనల్స్ కు సాధ్యపడింది. ఫ్యాషన్ సంబంధించిన విజ్యువల్ మెర్చండైజింగు, ఎగ్జిబిషన్ మరియు డిజైన్ డిస్ప్లే, గ్రాఫిక్ డిజైన్, ఫ్యాషన్ జర్నలిజం, స్టైలింగు, ఫోటోగ్రఫీ, ఎడ్వర్టైజింగు మరియు పబ్లిక్ రిలేషన్లు వంటి ఏరియాలు ఫ్యాషను కమ్యూనికేషన్ ప్రోగ్రాములో ఉన్నాయి. అందుకనే ఎక్జిట్ లెవెల్ వద్ద సమృద్ధియైన నైపుణ్యం, నాలెడ్జ్ మరియు కాన్సెప్ట్ బేస్ తో ఫ్యాషను కమ్యూనికేషన్ విద్యార్థులు, ఫ్యాషను మరియు లైఫ్ స్టైల్ ఇండస్ట్రీకి అత్యంత ప్రభావితమైన మరియు ఆర్థిక పరమైన కమ్యూనికేషన్ మార్గాలు ఇవ్వడానికి డైనమిక్ ప్రొఫషనల్స్ ఉద్భవిస్తున్నారు

విజ్యువల్ మెర్చండైజింగు, గ్రాఫిక్ డిజైను, స్టైలింగు మరియు ఫోటోగ్రఫీ మరియు ఫ్యాషన్ జర్నలిజం వంటి సబ్జెక్టులలో వివరంగా, ప్రోజెక్టు వర్కు మీద ఎక్కువ విశేషంతో చదువుతారు. 5వ సెమిస్టరు తరువాత, క్రాప్టు సెక్టరు యొక్క అవసరాల్ని మరియు విస్తారాన్ని అర్థం చేసుకోవడానికి ఇండియాలోని రాష్ట్రాలలో క్రాప్టు క్లస్టరుని విద్యార్థులు అన్వేషిస్తారు. క్రాప్టులను ఉద్ధరించడానికి మరియు ప్రోత్సాహించ డానికి కమ్యూనికేషన్ డిజైన్ పరిష్కారాలని ప్రతిపాదిస్తారు. రెండు సెమిస్టర్లు ముగిసిన తరువాత, నిజమైన ఇండస్ట్రీ వాతావరణం అర్థం చేసుకోవడానికి మరియు వారి లెర్నింగుని అప్లై చేయడానికి కూడా, విద్యార్థులు ఇంటర్నషిప్ ప్రోజెక్టులను చేయడానకి ఇండస్ట్రీ వెళతారు.

విషయం

మొదటి సంవత్సరం
డిజైన్ లో కామన్ ఫౌండేషన్ ప్రోగ్రాము

రెండవ సంవత్సరం
భోధనా సంబంధమైన సిద్ధాంతము, అన్వేషణ మరియు అప్లికేషన్లును ఉపయోగించే కోర్సుల ద్వారా కమ్యూనికేషన్ మరియు డిజైన్ ఫండమెంటల్స్ లోని ఇన్ పుట్లను విద్యార్థులు పొందుతారు. ఫ్యాషన్ స్టడీలు, డిజైన్ ఫిలాసఫీ మరియు హిస్టరీ, కమ్యూనికేషన్ కాన్సెప్ట్ లు, రైటింగు డిజైను, విజ్యువల్ మెర్చండైజింగు, ఫోటోగ్రఫీ, డిజైన్ పద్ధతులు మరియు ఇంటిగ్రేటెడ్ ప్రోజెక్ట్ వంటి సబ్జెక్ట్ల ద్వారా ఇంట్రడక్షన్ ప్రోసెస్ మరియు కమ్యూనికేషన్ డిజైన్ ఒరియెంటేషను రెండు సెమిస్టర్లులో విస్తరించి ఎడ్రస్ చేయ బడింది.

మూడవ సంవత్సరం
క్రియేటివ్ మీద ఎక్కువ విశేషంతో మూడవ సంవత్సరం కోర్ డిసిప్లీన్ ఏరియాలో కేంద్రీకరిస్తుంది. 5వ మరియు 6వ సెమిస్టరులలో, అవేర్ నెస్ దగ్గరనుండి ప్రోబ్లెమ్ సాల్వింగ్ వరకు విధానము ఉద్భవిస్తుంది.
నాలుగవ సంవత్సరం
మరింత రీసెర్చ్, కంటెక్స్ ట్యువల్ స్టడీలు, సెమినార్లు మరియు డిజైన్ ప్రోజెక్టుల ద్వారా విద్యార్థులు ఎక్కువ అర్థం చేసుకోవడానికి వారి స్పెషలైజేషన్ ఏరియా డెవలప్ చేసుకుంటారు.

కేరీర్స్
ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన కమ్యూనికేషన్ నైపుణ్యాలని విద్యార్థులు పొందేలా ఫ్యాషను కమ్యూనికేషన్ ప్రోగ్రాము చేయబడింది. మొత్తం మీద నాలుగు ఎక్జిట్ లెవల్ ప్రోఫైల్స్ ఉంటాయి. గ్రాఫిక్ డిజైన్, విజ్యువల్ మెర్చండైజింగు మరియు రిటైల్ స్పేస్ డిజైన్, స్టైలింగు మరియు ఫోటోగ్రఫీ, మరియు ఫ్యాషన్ జర్నలిజం.

స్టార్ ఎంప్లోయర్లు
పేంటలూన్, షాఫర్స్ స్టాప్, మార్క్స్ & స్పెన్సర్స్, క్రిస్టియన్ డియర్, లైఫ్ స్టైల్, బెనెట్టన్, లిబర్టీ, ఫ్రీ లుక్, లోపెజ్ డిజైన్స్, మేరీ క్లైరీ, ఇమేజెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఏసియన్ ఏజ్, కోచర్ ఏసియా, ఫెమినా, ఎఫ్. డి. సి. ఐ., ఎమ్ టివి, ఎన్ డి టివి, టైమ్స్ నౌ, హైడ్ లైన్స్ టుడే, పెర్ ఫెక్ట్ రిలేషన్స్, విజ్ క్రాఫ్ట్ ఒగిల్ వీ & మేథెర్, లింటాస్ మొదలగునవి.