ఇ-జైన్ కోసం రిజిష్టర్ చేసుకోండి  
 
 

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ | మాస్టర్ ప్రోగ్రామ్స్

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - డిజైన్

ఫ్యాషన్ డిజైన్
లెదర్ డిజైన్
యాక్సెస్సరీ డిజైన్
టెక్సటైల్ డిజైన్
నిట్వేర్ డిజైన్
ఫ్యాషన్ కమ్యూనికేషన్

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - టెక్నాలజీ

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్స్ (బి.ఎఫి.టెక్) - అప్పారెల్ ప్రొడక్షన్


ఫ్యాషన్ డిజైన్

ఫ్యాషన్ మరియు దుస్తులు (ఫ్యాషన్ అండ్ అప్పారెల్)

'ఫ్యాషన్' అనే మాట అనుభవపూర్వకంగా, దర్జాగా, హుందాగా వుండే స్ధితి అనే భావనను కలుగజేస్తుంది. మన ఉద్దేశ్యంలో 'ఫ్యాషన్' మరియు 'దుస్తులు ధరించడం' అన్నది బహుముఖంగా, నిరంతరం మారుతూ, నిరంతరం పునర్ దర్శన మిస్తూ ఉండడమే.

ఫ్యాషన్ మరియు దుస్తులు అనే అంశం ః ఉత్తేజభరితమైన ఉద్యోగాన్ని సంపాదించేందుకు అవసరమైన లోతైన, విద్యతో లభించిన జ్ఞానంతో పాటు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఒక బహుముఖమైన 'ఫ్యాషన్' అనే ప్రత్యేకతను కలిగిస్తూ.

భారత దేశం అతి సౌందర్యమైన, ఆడంబరమైన, ఉన్నతమైన సంస్కృతిని కలిగివుండి, దుస్తులు, వాటి ధారణ విషయంలో కూడా ఈ సాంప్రదాయం, అలవాటూ, ఈ సంస్కృతి మనకు తరతరాలనుండి హుందాతనం ఉట్టిపడుతూ సంస్కారవంతమైన ఆభిరుచులను పుణికి పుచ్చుకున్నటువంటిదై, రాను రాను పరిణతిని చెంది చరిత్రలో మన దేశం సర్వతోముఖ ప్రజ్ఞకు, సంస్కృతికి, స్వభావానికి ఒక విధమైన ఉన్నతమైన ఆచారానికి పేరు గాంచినటువంటిది. ఈ సంస్కారవంతమైన ఆడంబర వేషధారణ, అలాగే ప్యాషన్ రంగంవైపు పాశ్చాత్యధోరణి, డిజైనింగ్‌లో లో భారతదేశం యొక్క ప్రతిభ, ప్రజ్ఞ మొత్తం మీద మరో ఆకర్షణీయమైన, విలాసవంతమైన, సొగసైన, ఫ్యాషన్ భరితమైన జీవనసరళికి నాంది పలికింది. ఫ్యాషన్ ఉత్పత్తుల వెల్లువతో ఫ్యాషన్ పరిశ్రమ రోజు రోజుకి ప్రవర్ధమానం చెందుతూ ఒక ప్రత్యేకతను సంతరించుకుని వుండి సృజనాత్మకతకు, కొత్త కొత్త ఊహలకు మరియు ఆర్థికంగా లాభసాటి అయిన డిజైన్ మెళుకువలతో, ఈ నాణ్యతను, నూతనత్వాన్ని, ఆధునికతను డిమాండ్ చేస్తూ వుండే ప్రపంచంలో నిరంతరం విపరీతమైన డిమాండ్ కలిగివున్న పరిశ్రమ.

ఫ్యాషన్ మరియు దుస్తులకు సంబంధించిన అంశం  ఫ్యాషన్ దుస్తుల తయారీ విషయంలో ఆకర్షణీయమైన డిజైన్లు యుక్త వయసులో వున్నవారి హృదయాలలో ఫ్యాషన్ పట్ల వారి అమితాశక్తి, వాటిని వేసుకుని తిరగాలని వారిలో తాపత్రయాన్ని రేకెత్తిస్తాయి. వారి ఫ్యాషనబుల్ దుస్తుల ధారణ వారికి అందరిలో అభినందనలను, మెప్పును తీసుకువస్తుందనే భావనను వారిలో కలుగజేస్తూ.

జా.ఫ్యా.టె.సం. లో ఫ్యాషన్ మరియు దుస్తుల విభాగంలో బోధించే గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ః ఫ్యాషన్ డిజైన్‌లో ప్రత్యేకతను కలిగి వున్న 4 సం||రాల కోర్సు ఇది.

వివరాలు (కంటెంట్స్)

ఒక సం||ర కాలపు ఫౌండేషన్ శిక్షణ విజయవంతంగా పూర్తయిన పిదప విద్యార్థులు హుమానిటీస్, దుస్తుల డిజైనింగ్, ఫ్యాషన్ ప్రదర్శనలు మరియు దుస్తుల తయారీ ప్రక్రియకు సంబంధించిన వివిధ విషయాలలో ప్రత్యేకమైన అంశాలను గురించి తెలుసుకుని, ఆకళింపు చేసుకుంటారు.

హుమానిటీస్ (మానవ విజ్ఞాన శాస్త్రం)

ఫ్యాషన్ అనేది సమాజంలో సంభవిస్తూ వుండే నిరంతమైన మార్పు, ఒక విశేషం వంటిది. దానిలో ఇమిడి వున్న సమైక్య అంశాలను గురించి లోతైన పరిజ్ఞానం - చరిత్ర, ప్రస్తుత కాలంలో జరుగుతున్న వ్యవహారాలు, అలాగే భవిష్యత్తులో రాబోయే ఫ్యాషన్ తీరు గురించి ముందే ఊహించగలిగి వుండడం అన్నవి ఒక వ్యక్తి యొక్క డిజైన్ ఫిలాసఫీ లోను, అతని యొక్క సిద్ధాంతాల నిర్మాణ క్రమంలోను ముఖ్యమైన పాత్రను వహిస్తాయి.

కీలకమైన విషయాలు (కీ ఏరియాస్)
                 -- ఫ్యాషన్ స్టూడియోస్
                 -- ఫ్యాషన్ గురించి ముందే ఊహించగలగడం మరియు పరిస్ధితిని విశ్లేషించడం
                     (ఫ్యాషన్ ఫోర్ కాస్టింగ్ అండ్ ట్రెండ్ ఎనాలిసిస్)
                 -- వేష భాషలు, దుస్తులకు సంబంధించి భారత చరిత్ర
                    (హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాస్ట్యూమ్స్)
                 -- వేష భాషలు, దుస్తులకు సంబంధించి పాశ్చాత్య దేశాల చరిత్ర
                     (హిస్టరీ ఆఫ్ వెస్టరన్ క్యాస్ట్యుమ్స్)
                 -- ఫ్యాషన్ మరియు డిజైన్ కు సంబంధించిన చరిత్ర
                     (హిస్టరీ అఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్)
                 -- వస్త్రాలను గురించి సదవగాహన
                     (అప్రేషియషన్ ఆఫ్ టెక్స్ టైల్స్)
                 -- కళా క్షేత్రాల (క్రాఫ్ట్ ఫీల్డ్) పై అధ్యయనం మరియు పరిశోధన
                     (క్యాఫ్ట్ ఫీల్డ్ స్టడీ అండ్ రిసెర్చ్)
ఫ్యాషన్ వ్యాపారం మరియు తయారీ ప్రక్రియ ః దీంట్లో అంశాలు దుస్తుల తయారీ విషయంలో, తయారీ ప్రక్రియలో సరైన అవగాహనను కలిగిస్తూ వుంటూ, ఫ్యాషన్ పరిశ్రమలో ఉపయోగిస్తూ వుండే వ్యూహాత్మక వ్యాపార లక్షణాలను గురించి కూడా ఒక అవగాహనను కలిగిస్తూ, ఈ కోర్సును నేర్చుకోవడంలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పుట్టిస్తూ ఫ్యాషన్ ఉత్పత్తి మరియు వాడకంలోను ఉన్న లోటును పూర్చడానికి సహకరించేటట్లుగా (కోర్స్) తయారు చేయబడింది

కీలకమైన విషయాలు (కీ ఏరియాస్)

                 -- ఫ్యాషన్ ను అమ్మగలగడం మరియు నిర్వహణ
                     (ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ మేనేజ్ మెంట్)
                 -- దుస్తుల తయారీ విధానం/ప్రక్రియ
                     (అప్పారెల్ మాన్యూఫాక్చరింగ్ ప్రోసెస్)
                 -- వస్త్రాలు మరియు ట్రిమ్ పరిశోధన మరియు లభ్యమయ్యే ప్రదేశం కనిపెట్టడం
                     (ఫ్యాబ్రిక్ అండ్ ట్రిమ్ రిసెర్చ్ అండ్ సోర్సింగ్)
                 -- మేధో సంపత్తిపై హక్కులు
                     (ఇంటెలెక్చువల్ ప్రౌపర్టీ రైట్స్)
                 -- అల్లిక దుస్తుల డిజైన్ మరియు దుస్తుల నిర్మాణం
                     (నిట్వేర్ డిజైన్ అండ్ అప్పారెల్ కన్ స్ట్రక్షన్)
                 -- పరిశ్రమలో ఇంటరన్ షిప్

దుస్తుల తయారీ ప్రక్రియలో విస్తృతమైన ఉత్పాదకాలు (ఇన్ పుట్స్)

                 -- భారతీయ మరియు పాశ్చాత్య దేశాలకు దుస్తుల నమూనా తయారీః
                     (ప్యాటరన్ మేకింగ్ ఫర్ ఇండియన్ అండ్ వెస్టరన్ అప్పారెల్స్)
                 -- అత్యాధునికమైన ఫ్యాషన్ దుస్తుల తయారీకై సృజనాత్మకమైన
                     నమూనాను తయారు చేయడం.
                     (క్రీయేటివ్ ప్యాటరన్ మేకింగ్ ఫర్ హావుట్ కూత్యూర్)
                 -- నమూనాను వర్గీకరణం చేయడం.
                     (ప్యాటరన్ గ్రేడింగ్)
                 -- వస్త్రాలను ధరించడంలో మెళకువలు (డ్రెసింగ్ టెక్నిక్స్)
                 -- దుస్తుల నిర్మాణం మరియు పరిపూర్ణత
                     (గార్మెంట్ కన్ స్ట్రక్షన్ అండ్ ఫినిషింగ్)
                 -- వస్త్రం యొక్క ఉపరితలాన్ని డిజైన్ చేసే మెళకువలు
                     (సర్ఫేస్ డిజైన్ టెక్నిక్స్)