బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ | మాస్టర్ ప్రోగ్రామ్స్
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - డిజైన్
ఫ్యాషన్ డిజైన్
లెదర్ డిజైన్
యాక్సెస్సరీ డిజైన్
టెక్సటైల్ డిజైన్
నిట్వేర్ డిజైన్
ఫ్యాషన్ కమ్యూనికేషన్
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - టెక్నాలజీ
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్స్ (బి.ఎఫి.టెక్) - అప్పారెల్ ప్రొడక్షన్
ఫ్యాషన్ & టెక్స్ టైల్
డిజైన్ ప్రోగ్రామ్.
కాలవ్యవధి - 4 సం||రాలు.
ఫ్యాషన్ మరియు టెక్స్‌టైల్ రంగం, టెక్స్‌టైల్ తయారీలో విస్తృతమైన
పరిధిలో బోధనాంశాలను నేర్చుకునే అవకాశం ఉన్నటువంటిది. అదే సమయంలో దుస్తుల
తయారి విధానంలో, స్వదేశీ ఫ్యాషన్ రంగంలో కూడా సృజనాత్మకత, సహజత్వం
ఉట్టిపడేటట్టుగా రూపకల్పనలో అవలంబించవలసిన పధ్దతులు, విధానాలు నేర్చుకుంటూ
అభివృద్ధి చెందే అవకాశంతో పాటుగా విఫణివీధిలో రోజ రోజుకు మారుతున్న
కొత్తదనాన్ని, కొత్త ఒరవడిని అనుసరించగలిగే రీతిలో వాస్తవ పరిస్ధితులను
గమనిస్తూ అటువంటి వేగంగా మార్పులు సంతరించుకునే ఈ రంగంలో దేశ, విదేశీ
సంస్థలలో టెక్స్‌టైల్ మిల్లుల లోనూ, ఎగుమతులను/కొనుగోళ్లను చేస్తూవుండే
చోట్ల, డిజైన్లను రూపకల్పన చేసే చోట్ల మరియు డిజైనర్ల వద్ద విస్తృతంగా
లభించే ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఈ భోదనాంశాలు ప్రధానంగా
ఉద్దేశింపబడినవి.
టెక్స్‌టైల్ రంగంలో నేత, అల్లిక మరియు అద్దకం (నిట్టింగ్, వీవింగ్ మరియు
ప్రింటింగ్) అన్నవి ఫ్యాషన్ మరియు టెక్స్ టైల్ రంగానికి అనుబంధ కళల వంటివి.
అలాగే, ఇవన్నీ కలిసి ఉత్కృష్టమైన, సంపన్నమైన మరియు బహుముఖ విజ్ఞాన
సముపార్జనకు దోహదం చేస్తాయనే ఆశయంతో, ప్రగాఢమైన నమ్మకంతో ఈ ఫ్యాషన్ మరియు
టెక్స్‌టైల్ పరిశ్రమ ఆధారపడి మనుగడ సాగిస్తోంది. ఒకే సారిగా, విద్యార్థుల
మెదడుకు పదును పెడుతూ వారిలో ఈ రంగంపై ఒక చక్కటి సదవగాహన కలుగజేస్తూ
విస్తృతమైన చారిత్రిక, సాంఘిక మరియు సాంస్కృతిక పరమైన పూర్వాపరాలను
దృష్టిలో పెట్టుకుని, వీటికి సంబంధించిన విషయాలపై ఒకేసారిగా భోదిస్తూ,
ప్రస్తుత పరిస్ధితులలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రూపశిల్పులు (డిజైనర్స్)
పని చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఔత్సాహిక విద్యార్థులకు విశదీకరించి,
బోధించడం జరుగుతోంది. అలాగే, సి.ఏ.డి/సి.ఏ.ఎమ్/ఐ.టి. లలో అనుభవం ఉన్నవారు
శీఘ్ర గతిని అభివృధ్ది చెందుతున్న ఈ రంగంలో ఉపయోగపడుతూ, పనికి వస్తున్న
వృత్తి సంబంధితమైన మెరుగైన ఆధునిక సాధానాలతో, వారి వారి కౌశల్యాన్ని ఇంకా
మెరుగు పరచుకుంటున్నారు.
ఫ్యాషన్ వ్యాపారంలో టెక్స్‌టైల్‌ను డిజైన్ చేయడమే ప్రధానమైన అంశంగా
ఉంటుంది. ఎగుమతి రంగంలో అతివేగవంతంగా విస్తరిస్తున్న కార్యకలాపాలతో దేశీయ
దుస్తుల తయారీ రంగంలో, అలాగే దేశీయ ఫ్యాషన్ పరిశ్రమ కూడా డిమాండ్ చేస్తూ
వుండే అధునాతనమైన వృత్తిపరమైన నాణ్యతను కోరి డిమాండ్ చేస్తూ వుండడం
డిజైనింగ్ చేయడంలో 60 నుండి 80 శాతం వరకూ ఉత్పత్తిలో ఖర్చు అయే సంబంధిత
ముడిసరుకు నాణ్యతను అలాగే టెక్స్‌టైల్ ను డిజైన్ చేయడంలోనూ ఇంకా మెరుగైన
రీతిలో అభివృధ్ది చేయడం అన్న వాటిని ఆశిస్తూ వుండడం -- ఈ అన్ని అంశాలు
కూడా టెక్స్‌టైల్ డిజైన్ చేయడంలో ప్రముఖమైన పాత్రను వహిస్తూ, అతి
ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ నాటి టెక్స్‌టైల్ పరిశ్రమ ఊహాత్మకమైన విలువ-ఆధారిత వ్యాపారం, మొత్తం
ఫ్యాషన్ వ్యాపారాన్ని ఆర్థికంగా నిలదొక్కుకుని మనుగడ సాగించగలిగే మిక్కిలి
లాభదాయకమైన వ్యాపారం గాను మార్చడంంలో ఇది అనూహ్యమైన మార్పును తీసుకురాగలదు.
జులై 2000 నుండి జా.ఫ్యా.టె.సం. లో ఫ్యాషన్ మరియు టెక్స్‌టైల్ కోర్సులను
ప్రారంభించడం జరిగింది.
పాఠ్యక్రమం విశేషాలు (కోర్స్ కంటెంట్స్)
మొదటి సం||రం. మొదటి సం||రం (2 సెమిస్టర్లు) ఫ్యాషన్ మరియు టెక్స్‌టైల్
విద్యార్థులకు కామన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌గా వుంటుంది. విద్యార్ధులు చదువ
వలసిన కామన్ సబ్జెక్టులు ఈ క్రింది విధంగా వుంటాయిః
-- ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్
-- జామెట్రీ
-- విజువలైజేషన్ రిప్రెజెంటేషన్
-- ఓవర్ వ్యూ ఆఫ్ ఫ్యాషన్
-- మెటీరియల్ స్టడీస్
-- కంప్యూటర్ అప్లికేషన్
-- ఫీల్డ్ స్టడీ, మరియు
-- ఇంటిగ్రేటెడ్ టెర్మ్ ప్రోజెక్ట్
రెండవ సం||రం. టెక్స్‌టైల్ రంగంలో వాడుకలో వుండే పరిభాష (టెర్మినాలజీ)
అన్న సబ్జెక్టుపై దృష్టి (ఫోకస్) సారించబడి, కేంద్రీకరించబడడం జరుగుతుంది.
అనగాః
-- అల్లిక/nనేత (వీవింగ్)
-- అద్దకం/ముద్రణ (ప్రింటింగ్)
-- ఎంబ్రాయిడరీ మరియు డైయింగ్
గ్రాఫిక్ సాఫ్ట్‌వేర్ అన్న సబ్జెక్టు పై కూడా ప్రాధాన్యతనిస్తూ, బోధించడం
జరుగుతుంది. అలాగే, రూపకల్పన (ఇమేజ్ క్రియేషన్)లో ఈ సాఫ్ట్‌వేర్ వాడకం
గురించి, అలాగే దాని ప్రాధమిక లక్షణాలపై (ఫండమెంటల్స్) కూడా బోధించడం
జరుగుతుంది. రెండవ సం||రం బోధించే ప్రధాన సబ్జెక్టులుః
-- డిజైన్ మెథడాలజీ
-- ఫ్యాషన్ స్టడీస్
-- సర్ఫేస్ టెక్నిక్స్
-- టెక్స్‌టైల్ సైన్స్
-- ఇంట్రడక్షన్ టు వీవింగ్ స్కిల్స్ మరియు నిట్టింగ్ స్కిల్స్
-- అప్రేషియేషన్ అఫ్ ట్రేడిషనల్ టెక్స్‌టైల్స్
-- కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఫర్ ప్రింట్
-- డిజిటల్ ఇమేజింగ్ మరియు ఎడిటింగ్ టెక్నిక్స్
-- టెక్స్ టైల్ డిజైన్ డెవలప్మెంట్ ప్రోజెక్టు
క్షేత్ర సందర్శన (ఫీల్డ్ విజిట్స్) మరియు ఇంటరన్ షిప్ కూడా టెక్స్‌టైల్స్
మిల్లుల లోను, ప్రింటింగ్ యూనిట్ల లోను మరియు ఇతర ప్రోసెస్సింగ్ జరిగే
చోట్ల వుంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్‌లో ముఖ్యమైన భాగాలుగా వుంటాయి.
మూడన సం||రం.
రెండవ సం||రం బోధించబడిన ఆయా సబ్జెక్టులతో విద్యార్థులలో అవగాహన
పెరుగుతుంది. డిజైన్‌లలో మెళకువలను గురించి నేర్పడం వల్ల, సాంకేతిక మరియు
మార్కెటింగ్ నైపుణ్యాన్ని అలాగే, వాక్చాతుర్యం (కమ్యూనికేషన్ స్కిల్స్)తో
పాటూ భోదించబడిన సబ్జెక్టులలో కూడా సరైన అనగాహన కలుగుతుంది.
విద్యార్థులు క్రాఫ్ట్స్ సర్వే కూడా చేపట్టడం జరుగుతుంది, క్రాఫ్ట్స్
వాతావరణంలో డాక్యుమెంటేషన్ గురించి కూడా నేర్చుకోవ డానికి అవకాశం
లభిస్తుంది.
నాలుగవ సం||రం..
ఈ రంగంలోని పరిశ్రమను గురించి ఇంకా బాగా అవగాహన పెంచుకోవడానికి
విద్యార్ధులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా వారు అనేక ఎలెక్టివ్
సబ్జెక్టులనెంచుకుంటారు. అలాగే, పరిశోధన ఆధారిత (రిసెర్చ్ బేస్డ్)
ప్రోజెక్టును గురించి స్వంతంగా అధ్యయనం చేయడం కూడా చేపడతారు. చివరి
సెమిస్టర్‌లో విద్యార్థులు ఒక పారిశ్రామిక క్లైంట్‌తో గానీ, ఎగుమతి
వ్యాపారంలో వుండే సంస్థతో గాని, ఒక డిజైనర్‌తో గాని లేక ఎన్.జి.ఓ. తో గానీ
డిప్లొమా ప్రోజెక్టును చేపట్టడం జరుగుతుంది. ఈ కాలవ్యవధిలో విద్యార్ధులు
స్పాన్సర్ చేయువారి సూచనల ప్రకారం పని చేయ వలసి వుంటుంది. చివరికి ఈ
కార్యక్రమం అంతా అతను గ్రాడ్యుయేట్ అవడంతో సుఖాంతమవుతుంది.
ఈ ప్రోగ్రామ్ విద్యార్థులను డిజైన్‌లో ఉండే మెళకువలను, సున్నితత్వాన్ని (సెన్సిటివిటీ)
గురించి అవగాహన కలిగించేటట్లు పరచయమవుతుంది. అలాగే, తయారీకి కావలసిన
వివరాలతో వారు సంపాదించిన అవగాహనతో వారిని సృజనాత్మకమైన, వినూత్నమైన
డిజైన్లలో అనుభవం గడించడానికి సిద్ధం చేస్తుంది. ఈ వృత్తి నైపుణ్య
సంపాదనలో ఈ ప్రోగ్రామ్ విద్యార్థులను అత్యున్నత స్ధాయిలో అన్ని దశలలోను,
అలాగే పారిశ్రామిక ఉత్పత్తిలో సాంకేతిక పరిజ్ఞానం మరియు మార్కెటింగ్‌కు
సంబంధించిన అంశాలన్నింటిపైన ప్రాదాన్యతనిస్తూ అనుభవాన్ని గడించేందుకు
సిద్ధం చేస్తుంది. అద్దకం (డైయింగ్, ప్రింటింగ్) మరియు అల్లిక, నేత (వీవింగ్)
వర్క్ షాపులలో పనిచేయడం ద్వారా విద్యార్థులు తమ డిజైన్లను, శాంపుల్సుగాను,
నమూనాలు గాను మార్చుకుంటూ ఉంటారు.
ఉద్యోగావకాశాలు
ఈ ప్రోగ్రామ్ విద్యార్ధులను విస్తృత పరిధిలో టెక్స్‌టైల్ మిల్లులలోను,
ఎగుమతి చేయు సంస్థðలలోను, అలాగే ఫ్యాషన్ డిజైనర్లతోనో లేక డిజైన్
స్టూడియోలలోనో లేక మిల్లుల లోనో, చేనేత సహకార సంఘాలలోనో లేక కొలుగోలు చేయు
ఏజెన్సీలలోనో, లేక డిజైన్ లేక ఫ్యాబ్రిక్ మేనేజర్ గానో లేక స్వయంగా తానే
ఒక డిజైనర్ గానో లేక ఔత్సాహిక పారిశ్రామికవేత్త గానో పనిచేసే
ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవడానికి దోహద పడుతుంది.
కళాత్మక విలువలతో కూడిన ఫ్యాషన్ దుస్తులు మరియు యాక్సెస్సరీస్,
సి.ఏ.డి. కొరకు కంప్యూటర్ వినియోగం.
దుస్తుల డిజైన్ మరియు ఫ్యాషన్ ప్రదర్శన (ప్రెజెంటేషన్) ః నైపుణ్యంతో
కూడుకున్న డిజైన్ ను సృష్టించడం లోనూ అలాగే ప్రదర్శించడం అన్నవాటికి
తీవ్రమైన కృషి, సాధన అవసరమవడమే కాదు. ఇది తరచుగా అనుభవం, కౌశల్యంపై
ఆధారపడి వున్నటువంటిదై, నేర్చుకునే సమయంలోనే వాటిని సృష్టించడం అన్నదానికి
ఒక మంత్రం లాంటిది. ఫ్యాషన్ డిజైన్ మరియు ప్రదర్శనలో ఈ రెండు అంశాలు
ముఖ్యమైన కీలకాంశాల వంటివి.
ఫ్యాషన్ పై వివరణ మరియు డిజైన్ (ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అండ్
డిజైన్)గ్రాఫిక్స్
కోసం కంప్యుటర్ ను ఉపయోగించడం (కంప్యూటర్ అప్లికేషన్ ఫర్ గ్రాఫిక్స్)
ఫ్యాషన్ పొటోగ్రఫీ మరియు స్టైలింగ్ పోర్ట్ ఫోలియోను అభివృధ్ది చేయడం
(పోర్ట్ ఫోలియో డెవలప్మెంట్)
గ్రాడ్యుయేషన్ డిప్లొమా ప్రౌజెక్ట్
జా.ఫ్యా. టె. సం. లోచివరి సెమిస్టర్ లో ఒక కలెక్షన్‌గా విద్యార్థులు
విస్తృత స్థాయిలో దుస్తుల తయారు చేసే ప్రక్రియను చేపడతారు. గ్రాడ్యుయేషన్
ప్రోజెక్టు కోసం ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా డిజైన్ కార్యకలాపాల షోకేస్
లాగ చివరికి సుఖాంతమవుతుంది. |