| |
|
|
1. జా.ఫ్యా.టె.సం., హైదరాబాద్‌ను చేరుకోవడం ఎలా?
జ. రైలు ప్రయాణం. సికిందరాబాద్ రైల్వే స్టేషను నుండి (రా. ప్యా.టె.సం.
ప్రాంగణం నుండి 22 కి.మీ. దూరంలో ఉంది) చార్జిలు ః టాక్సీ - ఇంచుమించుగా రు.లు.
500/-; ఆటో - ఇంచుమించుగా రు.లు. 250/-. సిటీ బస్‌లు ః క్రింద నంబర్లు గల బస్‌లు
స్టేషను నుండి హై టెక్ సిటీ/శిల్పారామం/కొండాపూర్ మార్గంలో తిరుగుతాయి.
రూట్ నం. 10హెచ్; 47కె.
నాంపల్లి రైల్వే స్టేషను నుండి (రా. ప్యా.టె.సం. ప్రాంగణం నుండి 16 కి.మీ.
దూరంలో ఉంది).
ఛార్జిలు ః ఇంచుమించుగా రు.లు. 500/-, ఆటో - ఇంచుమించుగా రు.లు. 250/-, సిటీ
బస్‌లు ః క్రింద నంబర్లు గల బస్‌లు పబ్లిక్ గార్డెన్స్ నుండి (ఇంచుమించు 1
కి.సి. నాంపల్లి స్టేషను నుండి)హై టెక్ సిటీ/శిల్పారామం/కొండాపూర్ మార్గంలో
తిరుగుతాయి.
రూట్ నం. 127కె; 127హెచ్; 127డి/కె - కోఠీ బస్ స్టాప్ నుండి బయలుదేరుతాయి
కాచిగూడ రైల్యే స్టేషను నుండి (రా. ప్యా.టె.సం. ప్రాంగణం నుండి 25 కి.మీ.
దూరంలో ఉంది).
ఛార్జిలు ః ఇంచుమించుగా రు.లు. 500/-, ఆటో - ఇంచుమించుగా రు.లు. 250/-. సిటీ
బస్‌లు ః క్రింద నంబర్లు గల బస్‌లు కాచిగూడ స్టేషనుకు 3 కి.మీ. దూరంలో వున్న
కోఠీ నుండి) దొరుకుతాయి. రూట్ నం. 127కె, 127హెచ్, 127డి/కె -- కోఠీ బస్
స్టాప్ నుండి బయలు దేరుతాయి.
రోడ్ ప్రయాణం ః మహాత్మా గాంధి బస్ స్టాండ్ నుండి కోఠి బస్ స్టాండ్ కు
చేరుకోవాలి. అక్కడ నుండి నం. 127కె, 127 హెచ్ బస్‌లు రా.ప్యా.టె.సం. ప్రాంగణం
వరకు ప్రయాణు చేస్తాయి. మార్గ మధ్యలో దిగడానికి జా.ఫ్యా.టె.సం. సమీపంలోనే
ఉన్న అమీర్ పేట, కుకట్ పల్లి మరియు మియాపూర్ స్టేజిలు ఉన్నాయి.
విమాన మార్గం ః జా.ఫ్యా.టె.సం. ప్రాంగణం నుండి ఇంచుమించుగా 30 కి.మీ.
దూరంలో వున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి. ఛార్జిలు ః రేడియో
క్యాబ్ ద్వారా ః రు.లు. 15/- కి.మీ. ఏరో ఎక్స్‌ప్రెస్ ద్వారా అయితే (ఏ.సి. బస్)
ప్రతి గంటకు విమానాశ్రయం నుండి లభిస్తుంది. (దిగ వలసిన చోటు - శిల్పారామం బస్
స్టాప్).
2. జా.ఫ్యా.టె.సం. యొక్క పరిపాలనా వ్యవహారాలు నిర్వహించేది ఎవరు?
జ. డైరెక్టర్ ః డా|| కె.ఎస్. ప్రతాప్ కుమార్, ఐ.పి.ఎస్. సంప్రదించే ఫోన్ నం.
040-23114537.
డిప్యూటీ రిజిష్ట్రార్ (ఎఫ్ & ఏ) - శ్రీ డి. గోపాలకృష్ణ, సంప్రదించే ఫోన్ నం.
సహాయక రిజిష్ట్రార్.- శ్రీ. వై. చంద్రశేఖర్ ఫోన్ నం. 040-23110630
3. బోదించే వివిధ కోర్సులు?
జ. రిగ్యులర్ గా ఉండే ప్రోగ్రాములు
అండర్-గ్రాడ్యుయేట్ కోర్సులుః
ఫ్యాషన్ & అప్పారెల్
ఫ్యాషన్ & టెక్స్ టైల్స్
ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ యాక్సెస్సరీస్
ఫ్యాషన్ & కమ్యూనికేషన్
ఫ్యాషన్ & నిట్వేర్ డిజైన్
ఫ్యాషన్ టెక్నాలజీ
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు
ఫ్యాషన్ మేనేజ్ మెంట్ స్టడీస్
కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సి.ఇ. ప్రోగ్రామ్స్)
ఫ్యాషన్ & క్లోథింగ్ టెక్నాలజీ (ఎఫ్ి.సి.టి)
ఫ్యాషన్ రిటైల్ స్టోర్ మేనేజ్ మెంట్ (ఎఫ్.ఆర్.ఎస్.ఎమ్)
ఇంకా వివరాలు కావాలంటే, ఇక్కడ క్లిక్ చేయండి.
4. జా.ఫ్యా.టె.సం., హైదరావాద్ నందు హాస్టల్ సౌకర్యం ఉందా?
జ. సంస్ధ ప్రాంగణంలో బాలికల (గర్ల్ స్టూడెంట్స్)కు ముందుగా వచ్చిన వారికి
ముందుగా లభించే ప్రాతిపదికపై హాస్టల్‌లో వసతి సౌకర్యం దొరుకుతుంది. ఒక లేడీ
వార్డెన్ పర్యవేక్షణలో హాస్టల్ నడుపబడుతుంది. జూనియర్ బాలికలకు, సీనియర్
బాలికలకు వేరు వేరుగా హాస్టళ్లు ఉన్నాయి. ప్రతి రోజు హాస్టల్ ముఖ్యద్వారం
రాత్రి 9 గం.లకు మూసివేయబడుతుంది. రాత్రి 9 గం.ల తర్వాత నిద్యార్థుల (బాలికల)
ను బయటకు వెళ్లడానికి అనుమతించరు.
పురుషుల (బాయ్ స్టూడెంట్స్)కు హాస్టల్ సౌకర్యం లేదు.
5. హాస్టల్ లో ఎన్ని గదులు లభిస్తాయి?
జ. జూనియర్ బాలికలకు -- ఇంచుమించుగా 50 గదులున్నాయి.
6. ఒక గదిలో ఎంతమంది విద్యార్థులకు వసతి కల్పింపబడుతుంది?
జ. ఒక గదిలో 3 విద్యార్ధులు -- నవంబరు 2009 దాకా.
7. గది అద్దె ఎంత ఉంటుంది?
జ. ఎంట్రెన్స్ పరిక్షకు హాజరవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి
వచ్చినపుడు విద్యార్ధులకిచ్చే జా.ఫ్యా.టె.సం. యొక్క ప్రోస్పెక్టస్‌లో ఇతర
వివరాలతో పాటుగా ఫీజు వివరాలు తెలియజేయబడతాయి.
8. హాస్టల్ లో ఉండేవారికిచ్చే సౌకర్యాలు ఏమిటి?
జ. ఒక మంచం, చదువుకోవడానికి టేబులు, కుర్చి, అల్మైరా, ట్యూబ్ లైట్, ఫ్యాన్
మరియు చల్లని, వేడి నీళ్లు కూడా కలుగజేయబడతాయి - బాలికల హాస్టల్‌లో మాత్రం.
ఒకవేళ విద్యార్ధులు తమతో పాటుగా ఇతర సదుపాయాలేమైనా తీసుకురావాలనుకుంటే,
కేంధ్రం డైరెక్టరు గారి అనుమతి తప్పకుండా తీసుకోవాల్సివుంటుంది.
9. సంస్థ ప్రాంగణం సమీపంలో ఎక్కడైనా పురుషులకు వసతి సౌకర్యం లభిస్తుందా?
జ. పురుషులకైతే హాస్టల్ సౌకర్యం లేదు. అయితే, పురుషుల వసతి సౌకర్యం, పేయింగ్
గెస్ట్ హౌస్‌లు సంస్థ ప్రాంగణం దగ్గరలో దొరుకుతాయి, తదుపరి వివరాలకోసం ఇక్కడ
క్లిక్ చేయండి.
10. సంస్థ ప్రాంగణంలో ఫలాహారశాల (క్యాంటీన్) సౌకర్యం ఉందా?
జ. పురుషులకు, స్త్రీలకు కూడా ఫలహారశాల సౌకర్యం, సంస్థ ప్రాంగణంలోనే ఉంది,
నామ మాత్రపు ధరలకే (నామినల్ రేట్స్).
11. సంస్థ ప్రాంగణంలొ క్రీడల (స్పోర్ట్స్) కోసం సౌకర్యాలు ఉన్నాయా?
జ. సంస్ధ అన్ని రకాల క్రీడా సౌకర్యాలతో పూర్తిగా ఏర్పాట్లు చేయబడి వుంది,
ఆటలకు సంబంధించిన యంత్రాంగం (ఎక్విప్మెంట్) తోనూ, అలాగే ఆటల మైదానం కూడా.
పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికనుకూలంగా స్పోర్ట్స్ క్లబ్ కూడా వుంది. ఇది
విద్యార్థులచే నిర్వహింపబడుతూ, అధ్యాపకులు మరియు సిబ్బందిచే మానిటర్
చేయబడుతోంది.
12. సంస్ధ ప్రాంగణంలొ వ్యాయామశాల (జిమ్) సౌకర్యం ఉందా?
జ. ఇన్‌హౌస్ జిమ్, అధ్యాపకుని (ఇన్‌స్ట్రక్టర్)తో సహా ఉంది. ఈ జిమ్
సౌకర్యాన్ని వాడుకోవాలని అశించే విద్దార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది
వద్ద నుండి నెలకు నామమాత్రంగా రు.లు. 200/- జిమ్ నిర్యహణ (మైంటెనెన్స్) కోసమై
వసూలు చేయబడుతుంది.
13. జిమ్ పని వేళ##లేమిటి?
జ. పురుషులకు, స్త్రీలకు జిమ్ సౌకర్యం విడి విడిగా లభిస్తుంది.
పురుషుల వేళలు
స్త్రీల వేళలు
14. సంస్థ ప్రాంగణంలొ విద్యార్థులచే చేపట్టబడే వివిధ కార్యకలాపాలు ఏమిటి?
ఖాళీగా వుండే వేళల్లో అంటే సాయంకాలం 4.30 గం. ల నుండి, ప్రతి బుధవారం వివిధ
రకాలైన కార్యాకలాపాలు విద్యార్థుల వికాసానికై నిర్వహింపబడుతూ వుంటాయి.
అందుబాటులో వున్న వివిధ విద్యార్థుల క్లబ్ లుః
-- సాంస్కృతిక (కల్చరల్) క్లబ్
-- పర్యావరణం మరియు సాంఘిక సేవలు (ఎన్విరాన్ మెంట్
అండ్ సోషల్ సర్వీసెస్) క్లబ్
-- సాహిత్యం మరియు నాటక కళలకై (లిటరరీ అండ్ డ్రమెటిక్) క్లబ్
-- క్రీడల (స్పోర్ట్స్) కోసం క్లబ్
15. విద్యార్థుల హాజరు విషయంలో అవలంబించే ప్రామాణికం (అటెండెన్స్
క్రైటీరియా) ఏమిటి?
జ. అన్ని సెషన్సులోను కూడా క్లాసు ప్రారంబమైన 15 నిముషాల తర్వాత నుండి హాజరు
తీసుకోవడం జరుగుతుంది.
ఎండ్ టెర్మ్ పరీక్షలకు అర్హులవడానికి కనీసం ప్రతి సబ్జెక్టులోను 65 శాతం,
మొత్తం (ఓవరాల్) హాజరు, వైద్య సంబందిత సెలవులతో సహా 75 శాతం వుండి తీరాలి. ఈ
విషయంలో సఫలీకృతం కాకుండా, వైఫల్యం (ఫెయిల్) చెందినట్లయితే, విద్యార్థులు ఎండ్
టెర్మ్ పరిక్షకు హాజరవడానికి అనుమతింపబడరు.
16. విద్యా ఋణం (ఎడ్యుకేషన్ లోన్) పొందే సౌకర్యం ఏదైనా వుందా?
జ. ఎంట్రెన్స్ పరిక్షకు హాజరవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి
వచ్చినపుడు విద్యార్థులకిచ్చే జా.ఫ్యా.టె.సం. యొక్క ప్రోస్పెక్టస్‌లో, ఫీ
వివరాల క్రింద పూర్తి వివరాలు ఇవ్వబడి ఉన్నాయి.
17, హైదరాబాద్‌లో నిద్యాసంబంధిత సమన్వయకర్తలెవరు (ఎకడెమిక్ కో ఆర్డినేటర్స్)?
జ. ఫౌండేషన్ ప్రోగ్రామ్ - శ్రీమతి డా|| ఐ. రజిత, సంప్రదించవలసిన నం.
9441512423
ఫ్యాషన్ & అప్పారెల్ శ్రీమతి ప్రొ|| డి. మాలిని, " 9848392577
ఫ్యాషన్ & లైఫ్ స్టైల్ యాక్సెస్సరీస్ -- శ్రీ. జి.సి.రెడ్డీ " 9246561129
ఫ్యాషన్ & టెక్స్ టైల్స్ - కు. సుస్మిత పండా " 9490471020
ఫ్యాషన్ & కమ్యూనికేషన్ -శ్రీమతి నిష్రీన్ పిషోరి " 9963321115
ఫ్యాషన్ & నిట్వేర్ డిజైన్ - శ్రీ పృధ్వీరాజ్ మల్ " 973044163
ఫ్యాషన్ టెక్నాలజీ - శ్రీమతి షర్మీలా సూరె " 9985756291
ఫ్యాషన్ మేనేజ్ మెంట్ స్టడీస్ - శ్ర జి.హెచ్.ఎస్. ప్రసాద్ " 9440050171
స్డూడెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీ
కో-ఆర్దీనేటర్ - శ్రీమతి మన్కోమల్ కౌర్ తాపర్ " 9963031333
18. ఏమైనా సందేహాలున్నచో ఎవరిని సంప్రదించాలి?
జ. శ్రీ. వై. చంద్రశేఖర్ ,సహాయక రిజిష్ట్రార్.
జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ
హై-టెక్ సిటీ ఎదురుగా, మాధాపూర్, సైబరాబాద్,
హైదరాబాద్ - 500 081,
ఫోన్ నం. 040-23110841/42/43/44/45,
ఫ్యాక్స్ నం. 040-23114536.
విద్యాసంబంధిత (ఎకడెమిక్) సందేహాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
19. కేంద్రం యొక్క మౌలిక వసతుల వివరాలకై, ఇక్కడ క్లిక్ చేయండి.
20. హైదరాబాద్‌లో చూడదగిన పర్యాటక (టూరిస్టు) ప్రాంతాలు?
జ. చార్మినార్, గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియమ్, ఫలక్‌నుమా ప్యాలెస్,
మక్కా మసీదు, రామోజీ ఫిలిమ్ సిటీ, ఓషన్ పార్క్, జూ పార్క్, ఉస్మానియా
విశ్వవిద్యాలయం, స్నో వరల్డ్, నెక్లెస్ రోడ్, హై-టెక్ సిటీ, బిర్లా మందిర్,
ఐ-మాక్స్ ధియేటర్.
|
|
|
|
|