హైదరాబాద్
     
      సామూహిక ప్రోత్సాహకాలు.  
   
 
 

niftmail
 

"ఈ సామూహిక ప్రోత్సాహకాల పధకం క్రింద పూర్తిదశలో, నిరాఘాటంగా కొనసాగే సరఫరా విధానాన్ని అలాగే అరటినార మరియు లంబాణి సంబంధిత కళలో నిష్ణాతులైన చేతిపనివారి స్ధితి గతులను, వారు స్వయం శక్తిపై నిలబడ గలిగే విధానాన్ని అధ్యయనం చేయడం అలాగే వారు స్వయంగా, స్వశక్తి పై మనుగడ సాగించ గలిగే స్ధితిని కలుగజేయడం."

\పైన ఉదహరించిన అశయం హైదరాబాద్‌లోని జా.ఫ్యా.టె.సం.లొ ఫ్యాషన్ మేనేజ్ మెంట్ విభాగానికి చెందిన విద్యార్ధులు వారు కొనసాగించే విద్యా విధానంలో భాగంగా, అభివృధ్ది చేసే ఉద్దేశంలో సామూహిక ప్రయోజనాన్ని కలిగించే ఒక పధకం వంటిది

సాంకేతిక ప్రమేయంతో సాధించే అభివృధ్దితో పాటుగా మెరుగైన రూపకల్పనతోనే కాకుండా మార్కెటింగ్ నైపుణ్యం ద్వారా అనేక విధాలైన సామూహిక కళలనభివృధ్ది చేస్తూ , ప్రోత్సాహాన్ని కలుగజేయాలన్న తపనతో ప్రభుత్వము వారు చేపట్టిన ఒక బృహత్తర కార్యక్రమమే ఈ సామూహికాభివృధ్ది పధకం. ఈ అభివృధ్ది పధకం ద్వారా ప్రాంతీయంగా అలరారుతూ వుండే కళలను ప్రోత్సహించడమే కాకుండా సామూహిక స్పృహను కలిగించడం, అలాగే, వాటిని ప్రోత్సహించడం ద్వారా పూర్తిస్ధాయిలో ఇటువంటివారి ఆర్ధిక పరిస్ధితిని మెరుగు పరచడమే ఒక ధ్యేయంగా పెట్టుకుని, వారి జీవన స్ధితి గతులను, జీవన ప్రమాణాలను ఇంకా మెరుగు పరచాలని, వారికి అదనపు రాబడిని కలుగజేయడం, చివరికి స్త్రీలలో సాధికారికతను కూడా కలిగించాలనే ధ్యేయంతో వున్నది భారత ప్రభుత్వం. ఈ లక్ష్యాన్ని సాధించడం వల్ల పనిచేసే చోట సామర్ధ్యాన్ని, మెరుగైన పనిముట్ల వినియోగంతో, అభివృధ్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో, మెరుగైన పద్ధతులు, విధానాల ద్వారా మేలైన ఆధునిక పనిముట్ల వాడకం మరియు వివిధ సాంకేతిక ప్రక్రియలలో వుండే అసమానతలను, నైపుణ్యంలో వుండే కొరతను తగ్గించుకోవడం ద్వారా కూడా అధిక ఉత్పాదనా శక్తిని సాధించడం వీలవుతుంది. దీంతోపాటుగా నాణ్యతకు సంబంధించిన ప్రమాణాలను కనిపెట్టి చూసుకుంటూ, ఉత్పత్తుల నాణ్యతను, ప్రామాణికాన్ని కూడా పాటిస్తూ, ఉత్పాదనలను చేపడుతూ వుండే ప్రక్రియలలో కూడా కొత్తదనాన్ని అనుసరిస్తూ ఉండాల్సివుంటుంది.