హైదరాబాద్
     
urhere
      మా గురించి......  
   
 
 

niftmail
 

ఆధునిక సౌకర్యాలతో పాటు డి.వి.డి/సి.డి. రోమ్స్, ఆన్‌లైన్‌లో నిక్షిప్త సమాచారం (డేటాబేస్), మైక్రో ఫిలిమ్‌లు, స్లైడ్లు, ఆడియో-వీడియో క్యాసెట్లు, డిజైనర్లచే రూపొందించబడిన దుస్తులు, వివిధ సామాగ్రి,, చిన్న చిన్న సామానులు (యాక్సెస్సరీస్), పుస్తకాలు, జర్నల్సు మరియు వివిధ ప్రోజెక్టు నివేదికలు మున్నగువాటితో సకల సమాచారాన్ని అందించే పూర్తి స్థాయి సౌకర్యాలతో ఈ కేంద్రం పనిచేస్తోంది. ఈ సంస్ధ భౌతిక మరియు మేధో సంబంధిత సమాచారాన్ని అన్ని సౌకర్యాలతో పాటు అధ్యాపకులకు అలాగే విద్యార్థులకు కూడా ప్రస్తుత, భవిష్యత్ కాలంలో అవసరమయ్యే వివిధ రకాలైన సమాచారాన్ని అందించే వీలు కలిగి వుంది. జా.ఫ్యా.టె.సం. వారికి డిజైన్ రంగంలోను, సాంకేతిక రంగంలోను, అలాగే మేనేజ్‌మెంట్ రంగలో కూడా జ్ఞాన సముపార్జనలో చక్కటి ప్రమాణాలను పెంపొందిస్తూ సాగిపోవాలనే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తోంది.

కంప్యూటరీకరణ మరియు భధ్రతా వ్యవస్ధః

సమగ్రమైన, సంయుక్తంగా వుండే అలైస్ ఫర్ విండోస్ (ఏ.ఎఫ్.డబ్ల్యు) పధ్దతిని ప్రవేశ పెట్టి, దాని ద్వారా లైబ్రరీ నిర్వహణ జరుగుతూ, దాని ఆసరాతో గ్రంథాలయంలో చోటు చేసుకునే అన్ని వ్యవహారాలను కూడా సంఘటితం చేయడం జరుగుతోంది. ఈ ఏ.ఎఫ్.డబ్ల్యు అనే వ్యవస్థలో కొత్తగా సేకరింప బడిన పుస్తకాలను క్యాటలాగ్ చేయడం, సర్క్యులేషన్, సీరియల్స్, వ్యాసాలు (ఆర్టికల్స్) మరియు ఓ.పి.ఏ.సి (ఆన్ లైన్ పబ్లిక్ యాక్సెస్ క్యాటలాగ్) అనే అంశాలకు సంబంధించి వివిధ మోడ్యూల్సును కలిగి వుంది. అపయుక్త గ్రంథ పట్టిక (బిబిలియోగ్రఫీ) తో సమాచారం (అనగాః పేరు (టైటిల్), రచయిత, విషయం (సబ్జెక్ట్), కీలక పదాలు (కీ వర్డ్స్) -- అన్ని సౌకర్యాలను అందించడానికి సంబంధించి సమాచారం ఈ కేంద్రింలో పొందు పరచబడి వుంది. ఈ సమాచారమంతటిని ఓ.పి.ఏ.సి ఇంట్రానెట్ ద్వారా సంగ్రహించ వచ్చు. బార్ కోడ్ ఆధారిత కంప్యూటరీకరణ చేయబడిన సర్క్యులేషన్ పధ్దతిని ప్రవేశ పెట్టి ఈ కేంద్రం దానిని అనుసరిస్తోంది.

వివిధ సౌకర్యాలను డిజిటైజేషన్ చేసే ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలోవుంది.

ఈ రిసోర్స్ కేంద్రం 3 ఎమ్ భధ్రత (సెక్యూరిటీ) ఒక విధమైన పరిశోధన (డిటెక్షన్) పధ్దతిని నెలకొల్పడం ద్వారా మానిటర్ చేయబడుతూ, అదనంగా సి.సి.టి.వి.ల సదుపాయంతో నిరంతరం కాపలా (సర్విలెన్స్) కాయబడుతోంది.

ఈ కేంద్రం లాన్ (లోకల్ ఏరియా నెట్వర్క్) 20 పెంటియం కంప్యూటర్లతో అనుసంధానం చేయబడి, అతి వేగ వంతమైన వై.ఫి. ఇంటర్నెట్ కనెక్షన్ తో పని చేస్తోంది.

ఒకే సారి 100 మంది కూర్చోకలిగే సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటుగా. ఈ కేంద్రం పూర్తిగా శీతలీకరణం (ఎయిర్ కండిషన్డ్) చేయబడి వుంది.


కేంద్రం రూపురేఖలు (లే అవుట్స్)

ఈ రిసోర్స్ కేంద్రం భవనం మొదటి అంతస్తులో వుంది, ఈ క్రింద వివరించిన విధంగా 4 గదులలోః

ం గ్రంధాలను పేర్చిపెట్టిన ప్రదేశం.
ం చదువుకునెెందుకు వీలుగా హాలు
ం వివిధ సామగ్రిని పెట్టె ప్రదేశం
ం ఇంటర్నెట్ కేఫ్

మమ్మల్ని సంప్రదించండిః

జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ
(వస్త్ర మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం)
హై-టెక్ సిటీ ఎదురుగా, మాధాపూర్, సైబరాబాద్,
హైదరాబాద్ - 500 081,
ఫోన్ నం. +91 - 040-23114537, 23110841-44,
ఫ్యాక్స్ నం. +91- 040-23114536.
 

ఇ-మెయిల్: rcnifthyd@gmail.com       
rcnifthyd@yahoo.com.in